పవర్ ఫుల్ గ్లింప్స్

OG Unveiled: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా (సెప్టెంబర్ 2) 'OG' సినిమా బృందం విడుదల చేసిన కొత్త గ్లింప్స్, పోస్టర్‌ లు ఆకట్టుకుంటున్నాయి. పోస్టర్లలో పవన్ కొత్త లుక్‌లో కనిపించారు. ఒక పోస్టర్‌లో ఆయన క్లాసిక్ స్టైల్‌లో కారుపై కూర్చుని ఉన్న ఫోటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పోస్టర్ సినిమాకు సంబంధించిన 'ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' అనే టైటిల్‌కు తగ్గట్లుగా చాలా స్టైలిష్‌గా ఉంది.

పోస్టర్‌తో పాటు విడుదలైన ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ గ్లింప్స్‌లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీని పరిచయం చేశారు. ఆయన పాత్ర పేరు ఓమి. గ్లింప్స్ చివరిలో "హ్యాపీ బర్త్ డే ఓజీ" అని విలన్ ఓమి పాత్ర ద్వారా చెప్పించడం ఆసక్తికరంగా ఉంది. గ్లింప్స్‌లో ఇమ్రాన్ హష్మీ యాక్షన్ సన్నివేశాలు చాలా పవర్ఫుల్‌గా ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తనదైన స్టైల్లో కనిపించారు.

థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గ్లింప్స్‌కు మరింత ఊపునిచ్చింది. సినిమా థీమ్‌కు తగ్గట్లుగా బీజీఎంను కంపోజ్ చేశారు.'OG' సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను ఈ కొత్త గ్లింప్స్ , పోస్టర్ మరింత పెంచాయి. ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు, డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story