Kalki Sequel: స్పీడ్ పెంచిన ప్రభాస్..కల్కీ సీక్వెల్ కు డేట్స్ ఫిక్స్
కల్కీ సీక్వెల్ కు డేట్స్ ఫిక్స్

Kalki Sequel: కల్కి 2898 AD సీక్వెల్‌కు (పార్ట్ 2) సంబంధించి ప్రభాస్ డేట్స్ గురించిన ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతోంది. కల్కి 2' రెగ్యులర్ షూటింగ్ 2026 ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానుందని లేటెస్ట్ అప్ డేట్. మొదట కమల్ హాసన్ (యాస్కిన్) కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రభాస్ ఫిబ్రవరి రెండో వారంలో లేదా మార్చి నుంచి సెట్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈసారి మరింత వేగంగా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. దాదాపు 90నుంచి-100 రోజుల్లో ప్రభాస్ తన పోర్షన్‌ను పూర్తి చేస్తారని సమాచారం.
ఫిబ్రవరి నెల ప్రభాస్‌కు అత్యంత బిజీగా ఉండబోతోంది. అతను రెండు క్రేజీ సినిమాల మధ్య డేట్స్‌ను సర్దుబాటు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో కల్కీ షూట్ షెడ్యూల్ ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ కొత్త షెడ్యూల్ ఫిబ్రవరి 15 నుండి ప్రారంభం కానుంది. హను రాఘవపూడి ఫౌజీ సంబంధించిన కొన్ని బ్యాలెన్స్ సీన్లను కూడా ఈ మధ్యలోనే పూర్తి చేయాల్సి ఉంది.
దీపికా స్థానంలో సాయి పల్లవి?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. కల్కి పార్ట్ 1లో 'సుమతి'గా నటించిన దీపికా పదుకొనే డేట్స్ సమస్యలు లేదా రెమ్యూనరేషన్ కారణంగా సీక్వెల్ నుంచి తప్పుకున్నారని, ఆమె స్థానంలో సాయి పల్లవిని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

