Kalki 2: వైజయంతీ మూవీస్ పతాకంపై దర్శకుడు నాగ్ అశ్విన్ విజువల్ వండర్‌గా తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి, ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిన ఈ మైథో-sci-fi యాక్షన్ డ్రామా సీక్వెల్ ‘కల్కి 2’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, సినిమా పార్ట్-2 కి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి..

దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి 2’ కోసం పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు. కథ డిమాండ్ మేరకు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు కీలక షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. అయితే, ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌లో ఎక్కువగా ప్రభాస్ లేని సన్నివేశాలు, అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ఇతర ముఖ్య తారాగణానికి సంబంధించిన సీన్స్‌ను నాగ్ అశ్విన్ చిత్రీకరించినట్లు సమాచారం.

ఆగస్టు నుండి ప్రభాస్ ఎంట్రీ!

ఇక ఇప్పుడు అసలైన యాక్షన్‌కు సమయం ఆసన్నమైంది. రెబల్ స్టార్ ప్రభాస్ ఆగస్టు రెండో వారం నుండి ‘కల్కి 2’ షూటింగ్‌లో అధికారికంగా జాయిన్ కానున్నారు. ఇప్పటికే తన ఇతర ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ (Fauji) షూటింగ్‌ను దాదాపుగా ముగించిన ప్రభాస్, ఇక పూర్తిగా ‘కల్కి 2’ పైనే దృష్టి పెట్టనున్నారు. ఇందుకోసం ఆయన బల్క్ డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.

మూడు నెలల పాటు నాన్‌స్టాప్ షెడ్యూల్:

ఆగస్టు రెండో వారంలో ప్రారంభం కానున్న ఈ సరికొత్త షెడ్యూల్ దాదాపు మూడు నెలల పాటు నిరవధికంగా (Non-Stop) జరగనుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లోనే ప్రభాస్‌కు సంబంధించిన అత్యంత కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్, క్యారెక్టర్ డెవలప్‌మెంట్ సీన్స్‌ను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

వచ్చే ఏడాది కల్లా షూటింగ్ క్లోజ్.. 2027లో రిలీజ్?

ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, వచ్చే ఏడాది (2027) ఏప్రిల్ నాటికి సినిమా టాకీ పార్ట్ మరియు మొత్తం షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘కల్కి’ లాంటి భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా కీలకం కాబట్టి, గ్రాఫిక్స్ వర్క్ కోసం ఎక్కువ సమయం కేటాయించనున్నారు. అన్ని పనులను పూర్తి చేసి, 2027 సెప్టెంబర్ లేదా చివర్లో ఈ భారీ సీక్వెల్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

PolitEnt Media

PolitEnt Media

Next Story