వేణు స్వామి సంచలన కామెంట్స్

Venu Swamy’s Sensational Comments: సెలబ్రిటీల జాతకాలు, మరియు పూజల విషయంలో నిత్యం వార్తల్లో ఉండే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ నటి ప్రగతి పవర్‌లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో సాధించిన పతకాల వెనుక తన పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. నటి ప్రగతి ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని ఏకంగా నాలుగు పతకాలు సాధించి దేశం గర్వించేలా చేశారు. ఈ విజయంపై స్పందించిన వేణు స్వామి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

"నటి ప్రగతి వెయిట్ లిఫ్టింగ్‌లో గెలవాలని కోరుకుంటూ నా వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆ పూజల ఫలితంగానే ఆమె పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి నాలుగు పతకాలు సాధించగలిగారు" అని ఆయన తెలిపారు. తన వాదనకు బలం చేకూరుస్తూ ప్రగతి ఆ పూజల్లో పాల్గొన్నట్టుగా ఉన్న ఒక వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఇకపై జాతకాలు చెప్పనని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన వేణు స్వామి, మళ్ళీ ఈ విధంగా ప్రగతి విజయాన్ని తన పూజలకు ఆపాదించడం ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story