శివాజీకి ఆర్జీవీ వార్నింగ్

దండోరా' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తుల శైలి (డ్రెస్సింగ్ సెన్స్) గురించి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.శివాజీ వ్యాఖ్యలు ఒక వర్గం నెటిజన్ల మద్దతు పొందినా, సినీ పరిశ్రమలోని మెజారిటీ వ్యక్తులు మాత్రం ఆయన వాడిన భాషను, ఆయన ఆలోచనా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) ట్విట్టర్ (X) వేదికగా అత్యంత ఘాటుగా స్పందించారు .

రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో శివాజీని ఉద్దేశించి నేరుగా ఇలా విమర్శలు చేశారు. ఏయ్ శివాజీ.. నీ ఇంట్లోని మహిళలు నీలాంటి అనాగరిక, మురికి మనస్తత్వం ఉన్న వాడిని భరించడానికి సిద్ధంగా ఉంటే, వారికి నీ నీతులు చెప్పుకో, వారిపై మోరల్ పోలీసింగ్ చేసుకో" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.సమాజంలో లేదా సినీ పరిశ్రమలో ఉండే ఇతర మహిళల గురించి మాట్లాడే హక్కు నీకు లేదని, నీ అభిప్రాయాలను నీ దగ్గరే ఉంచుకోమని హెచ్చరించారు. మహిళలు ఏలాంటి బట్టలు వేసుకోవాలో నిర్ణయించడానికి శివాజీ ఎవరు అనే కోణంలో వర్మ ప్రశ్నించారు.

కేవలం ఆర్జీవీ మాత్రమే కాకుండా, ఇతర సినీ ప్రముఖులు కూడా శివాజీని తప్పుబట్టారు.ఒక సీనియర్ నటుడి నుండి ఇలాంటి మాటలు రావడం నిరాశ కలిగించిందని, మహిళల దుస్తుల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని చెబుతూ ఆ వ్యాఖ్యలకు మంచు మనోజ్ క్షమాపణలు చెప్పారు. శివాజీ వాడిన పదజాలాన్ని తీవ్రంగా ఖండించారు సింగర్ చిన్మయి. మహిళలను వస్తువుల్లా చూడటం మానుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

శివాజీ అసలు ఏమన్నారంటే

హీరోయిన్లు గ్లామర్ పేరుతో హద్దులు దాటుతున్నారని"సామాన్లు (ప్రైవేట్ పార్ట్స్)" కనిపించేలా చిన్న చిన్న బట్టలు వేసుకోవడం బాలేదని వ్యాఖ్యానించారు.చీరకట్టులోనే అసలైన అందం ఉంటుందని, అంగ ప్రదర్శన చేయడం సంస్కృతి కాదని ఆయన అన్నారు. ఈ క్రమంలో ఆయన వాడిన కొన్ని పదాలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story