‘Lucifer 3’: మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు, భారతీయ సినిమా దగ్గర 'లూసిఫర్' ఒక బ్రాండ్! ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఇప్పుడు అదే క్రమంలో వస్తున్న 'L2: ఎంపురాన్' కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక భారీ అప్‌డేట్ ఇచ్చారు. అదే... 'లూసిఫర్-3'

ప్రస్తుతం చేతిలో ఉన్న ఒకట్రెండు కమిట్‌మెంట్లు పూర్తి కాగానే కచ్చితంగా లూసిఫర్-3 ఉంటుందని పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. అయితే, దీనికి మోహన్ లాల్ కాల్ షీట్స్ కుదరడం కూడా చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. లూసిఫర్ ఫ్రాంచైజీని ఒక భారీ సినిమాటిక్ యూనివర్స్‌గా మార్చే ప్లాన్‌లో పృథ్వీరాజ్ ఉన్నట్లు ఈ మాటలతో అర్థమవుతోంది.

ఇక సినిమాల రిజల్ట్ గురించి మాట్లాడుతూ.. ‘ఎంపురాన్’ సినిమా కొద్ది మందికి నచ్చకపోయినా, తన మేకింగ్ స్టైల్ విషయంలో గానీ, నిబద్ధతలో గానీ ఎలాంటి తగ్గేదే లేదని కుండబద్దలు కొట్టారు పృథ్వీరాజ్. ముఖ్యంగా ఈ చిత్రంలో 'గుజరాత్ అల్లర్ల' ప్రస్తావన ఉందని వస్తున్న వార్తలపై ఆయన ఘాటుగా స్పందించారు.

"రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఎవరినో సంతృప్తి పరచడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసే వ్యక్తిని నేను కాదు" అని ఆయన స్పష్టం చేశారు. సినిమా అనేది ఒక కళ అని, దాన్ని కేవలం కథా కోణంలోనే చూడాలని పరోక్షంగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story