Priyadarshi’s ‘Premante’: ప్రియదర్శి ప్రేమంటే ఓటీటీ డేట్ ఫిక్స్
ప్రేమంటే ఓటీటీ డేట్ ఫిక్స్

Priyadarshi’s ‘Premante’: టాలీవుడ్లో డిఫరెంట్ రోల్స్ తో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి పులికొండ. కమెడియన్ టాలెంట్ ప్రూవ్ చేసుకుని.. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ప్రియదర్శి లీడ్ రోల్లో నటించిన మల్లేశం, బలగం, డార్లింగ్, 35 చిన్న కథకాదు, కోర్టు తదితర సినిమాలు మంచి హిట్స్ అందుకు న్నాయి.ఈ క్రమంలోనే 'ప్రేమంటే' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'థ్రిల్ యు ప్రాప్తిరస్తు' ట్యాగ్స్ తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా గత నెల 21న థి యేటర్లలో రిలీజ్ అయ్యింది. తాజాగా 'ప్రేమంటే' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది
'నెట్ ఫ్లిక్స్'లో ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈమేరకు సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 'అందమైన వైభవాల వేడుకయే కదా ప్రేమంటే' అంటూ క్యాప్షన్ఇస్తూ స్పెషలో పోస్టర్ రిలీజ్ చేసింది. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి సరసనగా ఆనంది హీరోయిన్గా నటించింది.సుమ కనకాల, వెన్నెల కిశోర్, హైపర్ ఆది తదితరులు కీలక పాత్ర ల్లో సందడి చేశారు. రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించారు.

