Actress Priyanka Chopra: హైదరాబాద్‌లో ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక చోప్రా..
ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక చోప్రా..

Actress Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాలీవుడ్ భారీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్న ప్రియాంక, షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి కాస్త రిలాక్స్ అయ్యారు. తన వీకెండ్ ముచ్చట్లను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
స్కిన్‌కేర్, స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్‌మెంట్
ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఆసక్తికరమైన ఫొటోలు, వీడియోలను షేర్ చేశారు. అందులో స్విమ్మింగ్ పూల్‌లో సేదతీరుతున్న విజువల్స్, ఫేస్ మాస్క్‌తో స్కిన్‌కేర్ తీసుకుంటున్న ఫొటోలతో పాటు వేసవి కాలం స్పెషల్ అయిన నేరేడు పళ్లను తింటున్న క్షణాలను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలకు "ఆదివారం అంటే ఇలా ఉండాలి.. ఇక వేసవి కోసం సిద్ధం" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వీటితో పాటు ఇటీవల ఆకాశంలో అరుదుగా కనిపించిన నీలి రంగు పౌర్ణమి చంద్రుడి ఫొటోను కూడా ఆమె అభిమానులతో పంచుకున్నారు.
ఆర్‌సీబీకి ప్రియాంక సపోర్ట్.. బిగ్ స్క్రీన్‌పై ఐపీఎల్ ఫైనల్..
ప్రియాంక చోప్రాకు క్రికెట్ అంటే ఉన్న ఇష్టాన్ని ఈ సందర్భంగా మరోసారి చాటుకున్నారు. ఇంట్లోనే పెద్ద స్క్రీన్‌పై ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టారు. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మద్దతుగా ఒక స్టిక్కర్‌ను జత చేస్తూ.. "ఫైనల్ చూడకుండా ఎలా ఉంటాం" అంటూ క్రికెట్ లవర్స్‌ను ఆకట్టుకునేలా రాసుకొచ్చారు.
గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ ప్రాజెక్టులు, వారణాసి షూటింగ్ కోసం అమెరికా, భారత్ మధ్య వరుస ప్రయాణాలతో బిజీగా గడుపుతున్న ప్రియాంక.. ఇలాంటి చిన్న విరామంతో రీఛార్జ్ అవుతున్నట్లు తెలుస్తోంది.

