Priyanka Chopra: సూపర్ స్టార్ మహేశ్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న అడ్వెంచరస్ విజువల్ వండర్.. 'వారణాసి'. ఈ సినిమాలో మహేశ్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 'మందాకిని' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ప్రియాంక.. ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఈ సినిమా గురించి ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. "నేను గత 14 నెలలుగా ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నాను. ఒక సినిమాను అద్భుతంగా తెరకెక్కించడానికి రాజమౌళి ఎంత సమయం తీసుకుంటారో మనందరికీ తెలిసిందే. ఆయన ప్రతి సన్నివేశాన్ని క్షుణంగా, ఎంతో పర్ఫెక్ట్‌గా పరిశీలిస్తారు. ఈ సినిమాలో నేను కొన్ని అద్భుతమైన స్లో మోషన్ జంప్స్, భారీ యాక్షన్ స్టంట్స్ చేశాను. ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ విషయాలు చెప్పలేను" అంటూ లీక్ ఇచ్చింది.అంతేకాదు, తాను ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలోకి 'వారణాసి' అత్యంత భిన్నమైనదని, ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని ప్రియాంక ఆనందం వ్యక్తం చేసింది.

మరోవైపు ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్స్‌ను దర్శకుడు రాజమౌళి కూడా ఇటీవల షేర్ చేశారు. ఇప్పటికే సినిమాలోని అత్యంత కీలకమైన షెడ్యూల్స్ పూర్తి చేశామని, ఈ ఏడాది అక్టోబరు నాటికి మొత్తం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందని వెల్లడించారు.

ఆ తర్వాత శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనులను పూర్తి చేసి.. వచ్చే ఏడాది (2027) జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 7న ఈ విజువల్ వండర్‌ను థియేటర్లలోకి తీసుకురావడానికి జక్కన్న టీమ్ పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story