అలాంటి వాళ్లు చూడొద్దు

Producer Bunny Vasu: 'ఈషా' అనే హారర్ థ్రిల్లర్ సినిమాకు సంబంధించిన ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈషా' సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన బన్నీవాసు ఈషా సినిమా ప్రేక్షకులకు నిజంగా భయం అంటే ఏమిటో చూపిస్తుంది. సినిమా చూసిన తర్వాత కూడా ఆ భయం వెంటాడుతుంది.ఈ సినిమాలోని చివరి 15 నిమిషాలు మామూలుగా ఉండవు. కథ మొత్తం ఆ చివరి భాగంలో ఒక కొత్త స్థాయికి చేరుకుంటుంది. ఆ సీన్స్ తెలిసినా కూడా భయపడే విధంగా ఉంటాయి.తెలుగు ప్రేక్షకులు ఇలాంటి హాట్ థ్రిల్లర్ సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమా వారికి ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది.దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని, ముఖ్యంగా భయంకరమైన సన్నివేశాలను చాలా సహజంగా చూపించారని ఆయన ప్రశంసించారు.బన్నీ వాసు సాధారణంగా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లలో, ముఖ్యంగా తాను భాగమైన చిత్రాల విషయంలో, బోల్డ్, స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. 'ఈషా' విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ చిత్రం ఎంత తీవ్రమైన (ఇంటెన్స్) థ్రిల్లర్‌గా ఉంటుందో చెప్పడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story