పవన్ ఒక్క రూపాయి తీసుకోలేదు

Producer Naveen Yerneni (Maithri Movie Makers): పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్‌లో నిర్మాత నవీన్ యెర్నేని (మైత్రి మూవీ మేకర్స్) పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమా ప్రారంభంలో తీసుకున్న నామమాత్రపు అడ్వాన్స్ తప్ప, ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని నవీన్ యెర్నేని తెలిపారు.

రాజకీయాల వల్ల షూటింగ్ ఆలస్యమై ప్రొడక్షన్ ఖర్చులు పెరగడంతో, నిర్మాతలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. "నేను మీకు అండగా ఉంటాను, మీరు సినిమాని కంఫర్టబుల్‌గా పూర్తి చేయండి" అని పవన్ స్వయంగా చెప్పినట్లు నిర్మాత పేర్కొన్నారు.

రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకుండా, సినిమా సక్సెస్ అయ్యాక వచ్చే లాభాల్లో వాటా తీసుకునేందుకు ఆయన అంగీకరించినట్లు సమాచారం.

పొలిటికల్ షెడ్యూల్స్ మధ్యలో కూడా పవన్ సినిమా కోసం చాలా కష్టపడ్డారని నిర్మాత చెప్పారు. కొన్నిసార్లు ఏకధాటిగా 24 నుండి 48 గంటల పాటు బ్రేక్ లేకుండా షూటింగ్‌లో పాల్గొన్నారని వెల్లడించారు.

డైరెక్టర్ హరీష్ శంకర్ విజన్ మీద నమ్మకంతో పవన్ పూర్తి సహకారం అందించారని, అందుకే సినిమా ఇంత క్వాలిటీగా వచ్చిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

"మేము చెప్పేది ఎవరూ నమ్మకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ మాపై చూపించిన ప్రేమ, సినిమా పట్ల ఆయనకున్న డెడికేషన్ వెలకట్టలేనివి అని నవీన్ అన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story