Bandla Ganesh: ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది! ఆస్తి వేలం వివాదంలో యూనియన్ బ్యాంక్ చర్యలను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

బ్యాంక్ తీసుకున్న రికవరీ చర్యల్లో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అసలు ఈ వివాదం ఏంటంటే... హైదరాబాద్‌కు చెందిన శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ రుణాల కోసం బండ్ల గణేశ్ కుటుంబ సభ్యులు తమ సొంత ఆస్తులను పూచీకత్తుగా పెట్టారు. రుణ బకాయిల రికవరీలో భాగంగా ఆ ఆస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేసింది.

బ్యాంక్ వేలం వేయడాన్ని సవాలు చేస్తూ బండ్ల గణేశ్ మొదట డెబ్ట్స్ రికవరీ ట్రిబ్యునల్ (DRT)ను ఆశ్రయించగా, వేలాన్ని రద్దు చేస్తూ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే, దీనిపై యూనియన్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా... డీఆర్‌టీ ఉత్తర్వులను కొట్టివేస్తూ బ్యాంక్ చర్యలను సమర్థించింది.

హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ బండ్ల గణేశ్ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ, అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. బ్యాంక్ ఆస్తి స్వాధీనాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది

PolitEnt Media

PolitEnt Media

Next Story