Naveen Chandra’s ‘Honey’ Glimpse: సైకలాజికల్ హారర్ థ్రిల్లర్..నవీన్ చంద్ర హనీ గ్లింప్స్ రిలీజ్
నవీన్ చంద్ర హనీ గ్లింప్స్ రిలీజ్

Naveen Chandra’s ‘Honey’ Glimpse: నవీన్ చంద్ర ఇటీవల కాలంలో కేవలం హీరోగానే కాకుండా, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ తన కెరీర్‌లో మంచి జోరు మీదున్నారు. లేటెస్ట్ గా నవీన్ చంద్ర హీరోగా కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’. దివ్య పిళ్లై హీరోయిన్. శేఖర్ స్టూడియోస్ సమర్పణలో రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 6న థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా మూఢనమ్మకాలు, డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో తెరకె క్కించిన ఈ చిత్రం అద్భుతమైన సినిమా టిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు. 'హనీ' సినిమా ఆయనకు సోలో హీరోగా మరో మంచి విజయాన్ని అందిస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ అరసాడ సంగీతం అందిస్తున్నా డు. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది.

