Puri Jagannadh Makes Interesting Comments: ఛార్మీతో బంధంపై పూరీ జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పూరీ జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Puri Jagannadh Makes Interesting Comments: టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటి-నిర్మాత ఛార్మీ కౌర్ మధ్య ఉన్న సంబంధంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై మరోసారి గట్టిగా స్పందించారు. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని, రొమాంటిక్ బంధం ఉందన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.
20 ఏళ్లుగా స్నేహితులం
ఇటీవల ఈ విషయంపై మాట్లాడిన పూరీ జగన్నాథ్, "ఛార్మీ నాకు 13 ఏళ్ల వయసు నుంచే తెలుసు. గత 20 సంవత్సరాలుగా మేమిద్దరం మంచి స్నేహితులుగా ఉన్నాం. కలిసి ఎన్నో సినిమాలు చేశాం. కానీ మా మధ్య ఎలాంటి రొమాంటిక్ వ్యవహారం లేదు" అని స్పష్టం చేశారు. ఈ పుకార్లకు కారణం సోషల్ మీడియాలోని యువతేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆమె సింగిల్‌గా ఉండటమే కారణం
పుకార్లు ఎందుకు వస్తున్నాయో విశ్లేషిస్తూ, "ప్రస్తుతం ఛార్మీకి ఇంకా పెళ్లి కాలేదు, తను సింగిల్‌గా ఉంది కాబట్టే ఈ రూమర్లు ఇంత బలంగా వస్తున్నాయి. ఆమె ఒంటరిగా ఉండటమే ఇలాంటి వార్తలకు కారణమవుతోంది" అని పూరీ వివరించారు.
తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని, అది ఎప్పటికీ అలాగే ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలతో పూరీ తనకూ, ఛార్మీకి మధ్య ఉన్న బంధంపై వస్తున్న ఊహాగానాలకు మరోసారి తెరదించారు.
