Pushpa 2 Released in Japan: జపాన్‌లో పుష్ప--2 రిలీజ్
పుష్ప--2 రిలీజ్

Pushpa 2 Released in Japan: ఇటీవల కాలంలో మన తెలుగు చిత్రాలకు జపనీస్ భాషలోనూ మంచి ఆదరణ దక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు విడుదలవగా, తాజాగా అల్లు అర్జున్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘పుష్ప 2’ చిత్రం జపాన్‌లో రిలీజ్ అవుతోంది. ‘పుష్ప కున్రిన్’ టైటిల్‌తో జనవరి 16న అక్కడి ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి టోక్యో వెళ్లాడు. జనవరి 15న జపాన్ థియేటర్లలో ప్రదర్శించనున్న ప్రీమియర్స్‌లో బన్నీ సందడి చేయనున్నాడు. ఈ సినిమాలో జపాన్‌కు సంబంధించి ఓ స్పెషల్ రెఫరెన్స్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులోని ఎంట్రీ ఫైట్ సీన్ జపాన్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో అల్లు అర్జున్ స్వయంగా జపనీస్‌లో డైలాగ్స్ చెప్పటం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఎలిమెంట్స్ ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని పెంచాయి. గీక్ పిక్చర్స్, షోచికు సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి పుష్ప మ్యాడ్‌నెస్‌ను జపాన్ సిల్వర్ స్క్రీన్స్ మీదకు తీసుకొస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా, ఫహాద్ ఫాజిల్ పోలీస్ ఆఫీసర్‌గా కీలక పాత్రలో కనిపిస్తాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు

