భార్యపై ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేసిన ఎంపీ రాఘవ్ చద్దా

వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దా తన భార్య, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాపై ఉన్న ప్రేమను మనసారా వ్యక్తం చేశారు. తమ కుమారుడు పుట్టిన తరువాత ఈ జంట మరింతగా #RelationshipGoals‌ గా అభిమానుల మన్ననలు పొందుతోంది. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

ఇటీవల 2026–2027 యూనియన్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాఘవ్ చద్దా చేసిన ప్రసంగంపై పరిణీతి ప్రశంసలు కురిపించారు. దీనికి ప్రతిగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాఘవ్, తన ప్రేమను బహిరంగంగా వ్యక్తపరిచారు.

తన గురించి తాను మాట్లాడుతూ, “నేను నటి పరిణీతి చోప్రా భర్తగా గర్వంగా చెప్పుకుంటున్నాను. పరిణీతి నా తొలి ప్రేమ, నా ఏకైక ప్రేమ. రాజకీయాలు నా తొలి ప్రేమ కాదు, రెండో ప్రేమ కూడా కాదు. అది నా ప్యాషన్ మాత్రమే. దేశానికి సేవ చేయడం నా లక్ష్యం, అదే ప్రతి ఉదయం నన్ను ముందుకు నడిపిస్తుంది. కానీ ప్రేమ విషయానికి వస్తే, ఆమెనే నా ఏకైక ప్రేమ,” అని తెలిపారు.

అతను ఇంకా మాట్లాడుతూ, “ఆమె నన్ను మొదటిసారి కలిసినప్పుడు నేను ఎవరో కూడా తెలియదు. నేను ఏ పని చేస్తున్నానో కూడా తెలియదు. ఆమెకు నచ్చింది ‘రాఘవ్ చద్దా’ అనే వ్యక్తి. రాజకీయ నాయకుడిగా కాదు. రెండు మూడు సార్లు కలిసిన తరువాతనే నేను ఎంపీగా ఏమి చేస్తానో, పార్లమెంట్ సభ్యుల బాధ్యతలేమిటో ఆమెకు తెలిసింది. అందువల్ల ఆమె ప్రేమించింది వ్యక్తిని, రాజకీయ నాయకుడిని కాదు,” అని భావోద్వేగంగా చెప్పారు.

ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల నుంచి మంచి స్పందన పొందుతున్నాయి.

Lipika Varma

Lipika Varma

Next Story