రాజుగా రఘు కుంచె

Raghu Kunche: రుఘ కుంచె గురించి ప్రత్యక చెప్పాల్సిన పని లేదు.ఏకంగా ఐదు నంది అవార్డులను గెలుచుకున్న రఘు కుంచె మ్యూజిక్ డైరెక్టర్ గా,సింగర్ గా,నటుడిగా రాణిస్తున్నాడు. రఘు కుంచెకు నాది నక్కిలెస్ గొలుసు అనే పాట చాలా పేరు తెచ్చింది.

ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న రఘు కుంచె ప్రస్తుతం లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం గేదెల రాజు .. కాకినాడ తాలూకా అనే ట్యాగ్ లైన్లో చైతన్య మోటూరి దర్శకత్వం వహిస్తున్నాడు. వాణి రవికుమార్ నిర్మిస్తున్నారు. జూన్ 13న రఘు కుంచె పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్న రఘు కుంచె గెటప్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. రవి ఆనంద్ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రఘు కుంచెనే సంగీతం కూడా అందిస్తున్నాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story