రాహుల్ సిప్లిగంజ్ వివాహం

Rahul Sipligunj’s Wedding: ప్రముఖ సింగర్, ఆస్కార్ అవార్డు విజేత రాహుల్ సిప్లిగంజ్ ఈ రోజు తన ప్రేయసి హరిణ్యా రెడ్డిని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.వధువు హరిణ్యా రెడ్డి ఆంధ్రప్రదేశ్ నేత మాజీ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె) చెందిన యువతి. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఒక లగ్జరీ ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి వైభవంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇరు కుటుంబ సభ్యులు,సన్నిహితులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.రాహుల్, హరిణ్యా రెడ్డిల వివాహ ఫోటోలు, ప్రీ-వెడ్డింగ్ వేడుకల (సంగీత్, హల్ది) ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారి ఎంగేజ్‌మెంట్ ఆగస్టు 17న జరిగిన సంగతి తెలిసిందే.

రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా పాటల, జానపద పాటల గాయకుడు, పాటల రచయిత. ఆయన తన ప్రత్యేకమైన వాయిస్, తెలంగాణ యాసతో కూడిన పాటలతో బాగా ప్రాచుర్యం పొందారు.2023లో వచ్చిన 'RRR' చిత్రంలోని ప్రపంచ ప్రఖ్యాత పాట నాటు నాటుకు గాను, కాల భైరవతో కలిసి ఈయన ఆస్కార్ అవార్డును అందుకున్నారు. 2019లో జరిగిన 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 3' రియాలిటీ షోలో విజేతగా నిలిచారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story