24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్

‘Rai Rai Ra Ra’ Song: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్, ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్ కులయికతోరూ పొందుతున్న ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఇంట్రెస్ట్ పెంచుతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ ఆడియన్స్ ను ఓ ఊపు ఊపేయగా.. తాజాగా రైరై రారా అంటూ విడుదల చేసిన మరో సాంగ్ 24 గంటల్లోనే 46.1 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్లో అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ సాంగ్ గా నిలిచింది.

ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చి స్వయంగా ఆల పించిన ఈ గీతానికి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. జానీ మాస్టర్ రూపొందించిన కొరియోగ్రఫీ ఈ పాటకు హైలైట్గా నిలిచింది. చెర్రీ చేసిన గ్రేస్ ఫుల్ స్టెప్పులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఫాస్ట్ మూమెంట్స్, మాస్ ఎనర్జీతో కూడిన డ్యాన్స్ చూసిన అభిమానులు చిరుత రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు. టాలీవుడ్లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ పాటల జాబితాలో రెండో స్థానంలో కూడా ఈ మూవీలోని చికిరి చికిరి పాటే నిలవడం విశేషం. ఈ పాట 29.19 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story