Raja Saab Paid Premieres: రాజా సాబ్ పెయిడ్ ప్రీమియర్స్: మల్టీప్లెక్స్ టికెట్ రూ.1000?
మల్టీప్లెక్స్ టికెట్ రూ.1000?

Raja Saab Paid Premieres: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ది రాజా సాబ్ మరికొద్ది రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ జనవరి 8నే భారీ ఎత్తున పెయిడ్ ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తోంది. అయితే తెలంగాణలో ఈ షోల అనుమతులు, ధరల విషయంలో ఉత్కంఠ నెలకొంది.
భారీ బడ్జెట్ సినిమా కావడంతో, ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్మాతలు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరినట్లు తెలుస్తోంది. నిర్మాతలు ప్రతిపాదించిన ధరలు ఇలా ఉన్నాయి:
మల్టీప్లెక్స్: రూ. 1,000
సింగిల్ స్క్రీన్: రూ. 800
ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులు సాఫీగానే ఉన్నప్పటికీ, తెలంగాణలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల బెనిఫిట్ షోలపై ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
ఓవర్సీస్‌లో ప్రభాస్ రాజసం
ఇండియాలో ఇంకా బుకింగ్స్ పూర్తిస్థాయిలో మొదలవ్వకముందే, విదేశాల్లో ప్రభాస్ మేనియా కనిపిస్తోంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 3.5 లక్షల డాలర్లు (రూ. 2.9 కోట్లు) వసూలు చేసింది. 1,045 స్క్రీన్లలో ఇప్పటికే 10,500 కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయి.
సినిమా హైలైట్స్:
ఈ చిత్రం 3 గంటల 10 నిమిషాల నిడివితో వస్తోంది. విశేషమేమిటంటే, ఇందులో 90% సమయం ప్రభాస్ స్క్రీన్ పైనే కనిపిస్తారని సమాచారం. హారర్ కామెడీ, ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ మునుపెన్నడూ లేని కొత్త లుక్‌లో అలరించనున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ది రాజా సాబ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమైంది.

