ఓటీటీలోకి రాజాసాబ్

Raja Saab: సంక్రాంతికి ప్రభాస్‌‌‌‌ నుంచి వచ్చిన ‘ది రాజా సాబ్‌‌‌‌’ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌‌‌‌కు రెడీ అయింది. జనవరి 9న థియేటర్స్‌‌‌‌లో విడుదలైన ఈ హారర్ ఫాంటసీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ నెల రోజులు తిరక్కముందే ఓటీటీలోకి వస్తోంది. ఫిబ్రవరి 6 నుంచి జియో హాట్‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌లో ఇది స్ట్రీమింగ్‌‌‌‌ కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో సంజయ్‌‌‌‌ దత్‌‌‌‌ విలన్‌‌‌‌గా నటించగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్స్‌‌‌‌గా నటించారు. శివరాత్రికి ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంతా భావించారు. అయితే వారం ముందుగానే స్ట్రీమింగ్‌‌‌‌కు వస్తోంది. మరోవైపు శర్వానంద్‌‌‌‌ హీరోగా సంక్రాంతికి వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం ఓటీటీ డేట్‌‌‌‌ కూడా రివీల్ అయింది. ఫిబ్రవరి 4 నుంచి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని అమెజాన్‌‌‌‌ ప్రైమ్ వీడియో సంస్థ ప్రకటించింది. సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌‌‌‌గా నటించిన ఈ చిత్రంలో వీకే నరేష్, వెన్నెల కిషోర్, సత్య, సునీల్‌‌‌‌ కీలకపాత్రలు పోషించారు. జనవరి 14న థియేటర్స్‌‌‌‌లో విడుదలైన ఈ చిత్రం మూడు వారాల లోపే ఓటీటీకి వస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story