రాజా సాబ్ వచ్చేది ఆ రోజే..

Telugu Cinema: రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా విడుదలై ఏడాది అయింది. 2023 ప్రభాస్ నటించిన రెండు సినిమాలు విడుదలైతే..2024లో కల్కితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు రాజాసాబ్ తో తన ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు వస్తున్నాడు ప్రభాస్. మారుతీ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే ప్రభాస్ తన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ హర్రర్, కామెడీ జానర్ లో ఈ మూవీ వస్తుంది.

రాజాసాబ్ సైతం జూన్ లేదా జులైలో రిలీజ్ అవుతుందని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ఈ మూవీ రిలీజ్ ఆలస్యమైంది. ఎట్టకేలకు డిసెంబర్ 5న రాజాసాబ్ ను విడుదల చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ ప్రకటనపై ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. తమ హీరోని ఈ నెల లేదా వచ్చే నెలలో చూడొచ్చు అనుకున్న ఫ్యాన్స్ కు ఈ ప్రకటన కాస్త నిరాశను మిగిల్చింది.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని VFX కి చాలా సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పూర్తయిన VFX ని మళ్ళీ అప్‌గ్రేడ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనివల్ల సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. గతంలో విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మూవీ తర్వాత ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 సినిమాలు చేస్తున్నాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story