రాజమౌళి విషెస్

Rajamouli Wishes: గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి హీరోగా తెరంగేట్రం చేస్తున్న సినిమా జూనియర్. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ లో కిరీటి రెడ్డి తన మొదటి సినిమాతోనే మంచి నటన, డ్యాన్స్, ఫైట్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని అర్థమవుతోంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ సినిమాకు శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా ప్రముఖ నటి జెనీలియా కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. 2022లోనే ప్రారంభమైన ఈ మూవీ ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయింది. జులై 18న రిలీజ్ కాబోతోంది. లేటెస్ట్ గా ఈసినిమా ట్రైలర్ ను దర్శక ధీరుడు రాజమౌళి రిలీజ్ చేశారు. జూనియర్ చిత్ర బృందానికి ఆయన మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషం కలిగిస్తోందన్నాడు. ఈ సినిమా విజయం సాధించాలని కోరాడు.

ఈ సినిమా ట్రైలర్ యువ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందని.. కాలేజీ నేపథ్యం, వినోదం, స్నేహాలు, ప్రేమ వంటి అంశాలు హైలైట్‌గా నిలిచాయి. ట్రైలర్‌లో కిరీటి ఎంతో ఎనర్జిటిక్‌గా, యువకుడిగా కనిపించాడు. హీరోయిన్ శ్రీలీల తనదైన గ్లామర్, చిరునవ్వుతో ఆకట్టుకోగా, కిరీటితో ఆమె కెమిస్ట్రీ బాగుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story