Telugu Cinema: ఓటీటీలోకి రాజమౌళి మెచ్చిన సినిమా
రాజమౌళి మెచ్చిన సినిమా

Telugu Cinema: పెద్ద బడ్జెట్, స్టార్ హీరో, స్టార్ దర్శకుడు ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ కావడం ఖాయమని బలంగా నమ్ముతారు. కానీ ప్రేక్షకులు మాత్రం కాంబినేషన్లకు కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలకే జై కొడుతున్నారు. దీంతో పెద్ద కాంబోలో వచ్చిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయితే.. కంటెంట్ ను నమ్ముకుని వచ్చిన చిన్న సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. ఇక ఈ కోవలోకే వస్తుంది టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా. కేవలం 7 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ 86కోట్ల వసూలు చేసింది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తుంది.
టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తమిళంలో తెరకెక్కినప్పటికీ..తెలుగు భాషలోనూ అందుబాటులో ఉంది. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించారు. డైరెక్టర్ రాజమౌళి, హీరో సూర్య సహా ఎంతో మంది ప్రముఖులు ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ మూవీపై అందరికీ ఆసక్తి కలిగింది.
మంచితనం ఎప్పుడూ గెలుస్తుందనేది టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఇతివృత్తం. హీరో మంచితనమే అతన్ని, అతని కుటుంబాన్ని కాపాడుతుంది. సినిమా అంతటా విభిన్న భావోద్వేగాలు కట్టిపడేస్తాయి. ఈ సినిమా చూసిన తర్వాత ఎంత మొండివాళ్ళు అయినా కరిగిపోతారు. సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్టు అద్భుతమైన నటనను కనబరిచారు. అదేవిధంగా హాస్యాన్ని బాగా పండించారు. మంచి సినిమా చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్.
