Rajamouli’s ‘Varanasi’ Title Sparks Controversy: రాజమౌళి వారణాసి టైటిల్ వివాదం: మహేష్ అభిమానుల ఆగ్రహం!
మహేష్ అభిమానుల ఆగ్రహం!

Rajamouli’s ‘Varanasi’ Title Sparks Controversy: ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్టు టైటిల్ విషయంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు మొదట అనుకున్న 'వారణాసి' టైటిల్‌ను తాజాగా తెలుగులో రాజమౌళి వారణాసి గా మారుస్తూ రాజమౌళి ప్రకటించడంతో మహేష్ బాబు అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇతర భాషల్లో కేవలం వారణాసి పేరుతోనే సినిమా విడుదలవుతుండగా, తెలుగులో మాత్రం టైటిల్ ముందు రాజమౌళి పేరు పెట్టడంపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. తమ హీరో మహేష్ బాబు పేరును వెనక్కి నెట్టేసి, దర్శకుడి పేరును హైలైట్ చేయడం ఏంటని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ టైటిల్‌ను 'మహేష్ వారణాసి'గా మార్చాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది. కాగా, గతంలోనూ మహేష్ బాబు నటించిన 'ఖలేజా' టైటిల్ సమయంలోనూ ఇదే తరహా వివాదం చెలరేగింది. అప్పుడు కూడా దర్శకుడు త్రివిక్రమ్, సినిమాకు 'మహేష్ ఖలేజా' అనే టైటిల్‌ను జోడించిన విషయం తెలిసిందే.

