Rajinikanth Movie: మహారాజ డైరెక్టర్‌తో రజినీకాంత్ మూవీ?
రజినీకాంత్ మూవీ?

Rajinikanth Movie: మహారాజా విజయం తర్వాత నిథిలన్ స్వామినాథన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రజనీకాంత్కు స్టోరీ చెప్పి ఒప్పించారని తమిళ సినీ వర్గాల టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుందని టాక్.
2024 జూన్ 14న విడుదలైన మహారాజా చిత్రంతో నిథిలన్ హిట్ అందుకున్నాడు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.20 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దగ్గర100 కోట్లకు పైగా వసూలు చేసింది.
రజనీకాంత్ కొత్త మూవీ కూలీపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 14న ఈ ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
