Rakul Preet Singh: బాహుబలి లాంటి సినిమా చేయాలి..అదే నా డ్రీమ్
సినిమా చేయాలి..అదే నా డ్రీమ్

Rakul Preet Singh: తాను ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, తన కెరీర్‌కు పునాది వేసిన తెలుగు సినిమాను, తెలుగు ప్రేక్షకులను చాలా మిస్ అవుతున్నానని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. మంచి స్క్రిప్ట్ దొరికితే వెంటనే తెలుగులో సినిమా చేస్తానని చెప్పారు.కొంత గ్యాప్ తర్వాత హైదరాబాద్ వచ్చిన ఆమె.. పంజాగుట్టలో సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో అండ్ అకాడెమీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ.. రాజమౌళి సృష్టించిన 'బాహుబలి' ప్రపంచం తనను ఎంతో ఆకట్టుకుందని, అందులో అనుష్క (దేవసేన) లేదా రమ్యకృష్ణ (శివగామి) లాంటి పవర్‌ఫుల్ పాత్రలు చేయాలని ఉందని తెలిపారు. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా, గుర్రపు స్వారీ, కత్తి సాము వంటి యుద్ధ విద్యలు నేర్చుకుని చేసే ఒక వారియర్ (Warrior) పాత్రను పోషించాలని తన కల అని చెప్పారు. బాహుబలి వంటి సినిమాల్లో నటించడం వల్ల నటిగా జీవితాంతం గుర్తుండిపోయే గుర్తింపు వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, టాలీవుడ్‌లో కూడా ఇటువంటి భారీ ప్రాజెక్ట్ వస్తే వెంటనే అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.రకుల్ తన కెరీర్ పట్ల చాలా స్పష్టమైన అభిప్రాయాలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె నటించిన హిందీ సినిమా 'దే దే ప్యార్ దే 2' 2025లో విడుదల కానుంది.

