Ram Charan Birthday Special: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. రేపే పెద్ది గ్లింప్స్
రేపే పెద్ది గ్లింప్స్

Ram Charan Birthday Special: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు అంటేనే టాలీవుడ్‌లో ఒక పండగ వాతావరణం. కానీ ఈసారి ఆ పండగ రెట్టింపు కాబోతోంది. అవును... ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'పెద్ది' నుంచి బిగ్ అప్‌డేట్ సిద్ధమైపోయింది. మార్చి 27న ఉదయం 11 గంటల 7నిమిషాలకు ఈ సినిమా గ్లింప్స్ మన ముందుకు రాబోతోంది!
ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యంత వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నారని టాక్. ఇక ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. ఆ గ్లింప్స్‌లో రెహమాన్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతుందో అని సోషల్ మీడియా అంతా ఇప్పటి నుంచే ఊగిపోతోంది.
"ఇక ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ మేకోవర్, ఆయన డైలాగ్ డెలివరీ ఈ గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలవబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

