Ram Charan’s ‘Hallallallo’ Creates: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నయా మాస్ సాంగ్ ‘హల్లల్లల్లో.. హల్లో’! ఈ పాటలో శ్రుతి హాసన్, జాన్వీ కపూర్‌లతో కలిసి రామ్ చరణ్ వేసిన గ్రేస్‌ఫుల్ స్టెప్పులు నెట్టింట నెక్స్ట్‌ లెవెల్ రచ్చ లేపుతున్నాయి. చరణ్ సిగ్నేచర్ మూమెంట్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

ఈ క్రేజ్ ఎలా ఉందంటే.. సాంగ్ రిలీజైన కేవలం కొన్ని గంటల్లోనే కోట్లలో వ్యూస్‌ను కొల్లగొట్టింది. రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా భోపాల్‌లో నిర్వహించిన ఒక భారీ ఈవెంట్‌లో ఈ థర్డ్ సింగిల్‌ను లాంచ్ చేశారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ హల్లల్లల్లో సాంగ్.. విడుదలైన కొద్ది గంటల్లోనే ఏకంగా 50 మిలియన్లకు పైగా.. అంటే 5 కోట్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఒక క్రేజీ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

మరోవైపు ‘పెద్ది’ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసింది. దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో ఈవెంట్‌లు, ప్రెస్‌మీట్‌లు నిర్వహిస్తూ ప్రేక్షకుల్లో అంచనాలను స్కై హైకి తీసుకెళ్తోంది. ఆల్రెడీ ముంబై, భోపాల్ సిటీలను షేక్ చేసిన పెద్ది టీమ్.. ఈరోజు బెంగళూరులో గ్రాండ్‌గా ప్రెస్‌మీట్ నిర్వహించబోతోంది. ట్రైలర్, సాంగ్స్‌తో ఆల్రెడీ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన 'పెద్ది' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story