షేక్ చేస్తోన్న రామ్ చరణ్ న్యూ లుక్

Ram Charan's New Look: డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న పెద్ది కోసం రామ్ చరణ్ కొత్త లుక్ లో కనిపించాడు. జిమ్ లో వర్కౌట్ చేస్తూ లేటెస్ట్ గా తన ఎక్స్ ల షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సినిమా కోసం రామ్ చరణ్ కఠినమైన వర్కౌట్లు, డైట్ పాటిస్తూ మరింత ఫిట్‌గా తయారయ్యారు. ఈ ఫోటోలలో ఆయన కండలు తిరిగిన దేహంతో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.

పెద్ది ఒక స్పోర్ట్స్ డ్రామా కావడంతో రామ్ చరణ్ క్యారెక్టర్ ఒక గ్రామీణ నేపథ్యంలో ఉండే యువకుడిది.ఈ సినిమాలో క్రికెట్ కుస్తీ వంటి క్రీడాంశాలు ఉన్నందున రామ్ చరణ్ తన శరీరాన్ని అథ్లెటిక్‌గా మార్చుకుంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. ఆ పోస్టర్‌లో ఆయన పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మాస్ లుక్‌లో కనిపించి అభిమానుల అంచనాలను మరింత పెంచారు.

పెద్ది షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ సినిమా మార్చి 27, 2026న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story