Ram Charan’s ‘Peddi’ Begins: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ పెద్ది బాక్సాఫీస్ దగ్గర విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తోంది. యునైటెడ్ కింగ్‌డమ్ లో పెద్ది అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే థియేటర్లలో మెగా ప్రభంజనం ఖాయంగా కనిపిస్తోంది.

లండన్ వీధుల్లో పెద్ది హవా..

సాధారణంగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు అమెరికా మార్కెట్ అడ్డాగా నిలుస్తుంది. కానీ పెద్ది చిత్రం మాత్రం యూకేలోనూ ట్రేడ్ వర్గాలను విస్మయపరిచే రేంజ్‌లో దూసుకుపోతోంది. విడుదలకు ఇంకా వారం రోజులకు పైగా సమయం ఉన్నప్పటికీ, అక్కడ ఇప్పటికే 12,500కు పైగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోవడం విశేషం. గ్లోబల్ స్టార్‌గా రామ్ చరణ్‌కు అంతర్జాతీయంగా పెరిగిన క్రేజ్‌కు ఈ రికార్డు బుకింగ్స్ నిదర్శనమని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ జోరు చూస్తుంటే ఓపెనింగ్ డే రోజే యూకే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

సినిమా హైలైట్స్..

గ్రామీణ క్రీడా నేపథ్యానికి బలమైన యాక్షన్, ఎమోషన్స్‌ను జోడించి బుచ్చిబాబు ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలవనుంది. వృద్ధి సినిమాస్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో, పాన్-ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందింది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేయగా, యూకేలో కనిపిస్తున్న ఈ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుతో పెద్ది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందోనని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జూన్ 4న ఈ చిత్రం తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story