Ram Gopal Varma: ధురంధర్-2 దర్శకుడికి వర్మ చురకలు.. ఆ పాత్ర తప్పుగా చూపించారంటూ ఫైర్!
ఆ పాత్ర తప్పుగా చూపించారంటూ ఫైర్!

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ... అండర్ వరల్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. గ్యాంగ్‌స్టర్ల మనస్తత్వాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసే ఆర్జీవీ, తాజాగా 'ధురంధర్-2' సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాలో చూపించిన దావూద్ ఇబ్రహీం పాత్ర వాస్తవానికి చాలా దూరంగా ఉందని వర్మ అభిప్రాయపడ్డారు.రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ.. "దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాడని, అతడు ఏ పనీ చేయడం లేదని కొన్నేళ్లుగా వస్తున్న వార్తలను బట్టి స్పష్టమవుతోంది" అని పేర్కొన్నారు. అంతేకాదు, దాదాపు 20 ఏళ్ల క్రితమే దావూద్ తన క్రిమినల్ యాక్టివిటీస్ నుంచి రిటైర్ అయ్యాడని తాను నమ్ముతున్నట్లు వర్మ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
అయితే 'ధురంధర్-2' సినిమాలో మాత్రం సీన్ మరోలా ఉంది. భారత్‌లో అలజడి సృష్టించేందుకు దావూద్ పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISIతో కలిసి కుట్రలు పన్నినట్లు దర్శకుడు చూపించారు. దీనిపై స్పందిస్తూ.. సినిమాలో చూపించినట్లుగా దావూద్ ఇంకా ప్లాన్లు వేస్తున్నాడనేది వాస్తవం కాదని, అది కేవలం సినిమాటిక్ డ్రామా మాత్రమేనని ఆర్జీవీ కొట్టిపారేశారు.
అండర్ వరల్డ్ డాన్‌ల లైఫ్ స్టైల్‌పై 'సత్య', 'కంపెనీ' వంటి సినిమాలతో మెప్పించిన వర్మ.. ఇప్పుడు 'ధురంధర్-2' దర్శకుడు ఆ పాత్రను తప్పుగా చిత్రీకరించారని అనడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వాస్తవ పరిస్థితులను పక్కన పెట్టి, కేవలం కమర్షియల్ హంగుల కోసమే ఇలాంటి పాత్రలను సృష్టిస్తున్నారని వర్మ విమర్శించారు.

