బెంగళూరులో టైటిల్‌ గ్లింప్స్‌!

Ramayana Big Update: బాలీవుడ్ నుంచి రాబోతున్న మరో అవైటెడ్ భారీ చిత్రమే 'రామాయణ’. నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్ బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీదేవోల్ నటిస్తున్నారు. కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ భారీ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించిన నాటినుంచి ఏ అప్డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ సహా గ్లింప్స్ ని విడుదల చేసేందుకు తేదీ, సమయం ఖరారు చేసేసారు. ఈనెల 3న ఉదయం 11 గంటల 30 నిమిషాలకి గ్రాండ్ ఈవెంట్ తో అధికారిక టైటిల్, లోగోని రివీల్ చేస్తారని సమాచారం. బెంగళూరులో జరగనున్న ఈ కార్యక్రమం కోసం తారలంతా అక్కడికి బయల్దేరుతున్న వీడియోలు ట్విట్టర్ లో వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రానికి నమిత్ మల్హోత్రా సహా కన్నడ రాకింగ్ స్టార్ యష్ కూడా నిర్మాణం వహిస్తున్నాడు. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి సెకండ్ పార్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ల్ చేస్తున్నారు. ఈ షూటింగ్‌ జరిగినన్ని రోజులు రణ్‌బీర్‌ ‘రామాయణ’ కోసం తన అలవాట్లను మార్చుకున్నారు. కొన్ని రోజుల పాటు మాంసాహారం, మద్యపానం మానేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story