Ramayana: బాక్సాఫీస్ వద్ద రామాయణ ప్రభంజనం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువ.. దీపావళి నాడు సరికొత్త రికార్డు..
దీపావళి నాడు సరికొత్త రికార్డు..

Ramayana: భారీ తారాగణం, అత్యున్నత నిర్మాణ విలువల కలయికతో పౌరాణిక చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామాయణ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం, కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్ మార్కును తాకే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా దీపావళి పండుగ వేళ సినీ ప్రియులు థియేటర్లకు పోటెత్తడంతో సరికొత్త బాక్సాఫీస్ రికార్డు నమోదైంది.
టైగర్ 3వ రికార్డు బ్రేక్.. సరికొత్త చరిత్ర
దీపావళి పర్వదినంతో పాటు ఆదివారం కలిసి రావడంతో చిత్రానికి అదిరిపోయే మైలేజ్ లభించింది. నాలుగో రోజైన ఆదివారం ఒక్కరోజే భారత్‌లో ఏకంగా రూ.56.15 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. గతంలో 2023 దీపావళి నాడు సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సాధించిన రూ.44.50 కోట్ల వసూళ్ల రికార్డును రామాయణ సునాయాసంగా అధిగమించింది. దీనితో దీపావళి రోజున దేశీయంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన బాలీవుడ్ చిత్రంగా సరికొత్త చరిత్ర లిఖించింది.
దేశీయంగా పటిష్టమైన కలెక్షన్ల ప్రయాణం
ఈ చిత్రం నాలుగు రోజుల దేశీయ నెట్ వసూళ్ల వివరాలు..
మొదటి రోజు: రూ.64.85 కోట్లు
రెండో రోజు: రూ.48.05 కోట్లు
మూడో రోజు: రూ.69.80 కోట్లు
నాలుగో రోజు: రూ.56.15 కోట్లు
నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.238.85 కోట్ల నెట్ (రూ.285.20 కోట్ల గ్రాస్) కలెక్షన్లు నమోదయ్యాయి. గతంలో ప్రభాస్ ‘ఆదిపురుష్’ తొలి నాలుగు రోజుల్లో రాబట్టిన రూ.237 కోట్ల నెట్ రికార్డును సైతం ‘రామాయణ’ అధిగమించడం విశేషం.
రూ.500 కోట్ల మైలురాయి ముంగిట
దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లోనూ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఓవర్సీస్లో నాలుగు రోజుల్లో ఏకంగా రూ.214 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీనితో కలిపి ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ.499.20 కోట్లకు చేరుకున్నాయి. విడుదలైన అతి తక్కువ సమయంలోనే రూ.500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడుతూ ఈ పౌరాణిక చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.

