Rakul Preet Sing: భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న రామాయణం చిత్రంలో భాగం కావడంపై ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు గొప్ప వారసత్వాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పే ఒక అద్భుతమైన ప్రయాణమని ఆమె అభివర్ణించారు. ఈ సినిమాతో ప్రేక్షకులు సరికొత్త ప్రపంచాన్ని అనుభూతి చెందుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ట్రైలర్ లాంచ్‌ వేడుకలో రకుల్ సందడి

ఇటీవల ఢిల్లీలో ఘనంగా నిర్వహించిన రామాయణం ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె రాస్తూ.. "ఇంతటి చారిత్రాత్మక చిత్రంలో నటించడం నా జీవితాంతం గుర్తుండిపోయే ఒక గొప్ప అనుభూతి. అంతర్జాతీయ వేదికపై మన భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఆ భావనను మాటల్లో చెప్పలేను" అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

శూర్పణఖగా సరికొత్త అవతారంలో..

దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ పౌరాణిక దృశ్యకావ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ కీలకమైన శూర్పణఖ పాత్రలో కనిపించనున్నారు. రావణాసురుడి సోదరిగా కథను మలుపు తిప్పే ఈ పాత్రలో రకుల్ లుక్ ఎలా ఉండబోతోందనే దానిపై ఇప్పటికే సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

రెండు భాగాలుగా విడుదల

అత్యాధునిక సాంకేతిక విలువలు, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మేకర్స్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో భాగంగా తొలి భాగాన్ని 2026 దీపావళి కానుకగా విడుదల చేయనుండగా, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story