.సీతగా సోనాలి బింద్రే..

Ramayana movie: రణ్‌బీర్ కపూర్, యష్ నటించనున్న రామాయణం సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే..ఈ నేపథ్యంలో ఒకప్పుడు బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ హీరోగా రామాయణం సినిమా తెరకెక్కబోయిందనే న్యూస్ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

1990లలో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఇందులో సల్మాన్ ఖాన్ శ్రీరాముడిగా, సోనాలి బింద్రే సీతగా నటించాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయ్యిందని, సల్మాన్ శ్రీరాముడి పాత్రలో విల్లు, బాణంతో ఫోటోషూట్ కూడా చేశారని వార్తలు వచ్చాయి.

అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ సమయంలో దర్శకుడు సోహైల్ ఖాన్, నటి పూజా భట్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని, ఈ విషయం సోహైల్ తండ్రి సలీమ్ ఖాన్‌కు తెలియడంతో ఆయన ఒప్పుకోకపోవడంతో పూజా భట్ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని సమాచారం. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోయింది.

ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటిస్తున్న 'రామాయణం' చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story