Rambha Urvashi Menaka Teaser: రంభ ఊర్వశి మేనక టీజర్: నవ్వులు పంచేందుకు వస్తోన్న అల్లరి నరేష్!
అల్లరి నరేష్!

Rambha Urvashi Menaka Teaser: కొంతకాలంగా విభిన్నమైన కథలు, సీరియస్ పాత్రలతో ప్రయోగాలు చేస్తున్న టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్.. మళ్లీ తనదైన శైలిలో నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా ‘రంభ ఊర్వశి మేనక’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలకాగా, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ చిత్ర టీజర్‌లో వెన్నెల కిషోర్ ఇంద్రుడి పాత్రలో కనిపించగా, అల్లరి నరేష్ రాజమండ్రికి చెందిన ఒక సాధారణ యువకుడిగా కనిపిస్తున్నారు. చిన్నతనంలో నరేష్ పాత్రతో వాళ్ల నాన్న మాట్లాడుతూ.. ఒక ప్రత్యేకమైన బాక్స్‌పై రోజూ ‘రంభ ఊర్వశి మేనక’ అని రాస్తూ ఉంటే, ఇంద్ర లోకం నుంచి ఆ ముగ్గురు అప్సరసలు నేరుగా భూమి మీదకు వచ్చి నిన్ను కలుస్తారని చెబుతారు.
నాన్న మాటలను గుడ్డిగా నమ్మిన నరేష్.. ఆ చిన్ననాటి అలవాటును ఏళ్ల తరబడి కొనసాగిస్తూ, ఏకంగా ఒక దీక్ష లాగా చేపడతాడు. అతని భక్తికి మెచ్చి రంభ, ఊర్వశి, మేనక నిజంగానే భూమి మీదకు దిగి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ముగ్గురు అందాల రాశులు భూమిపైకి వచ్చాక నరేష్ జీవితంలో ఎలాంటి నవ్వుల అల్లకల్లోలం సృష్టించారనేదే ఈ సినిమా ప్రధాన కథాంశంగా తెలుస్తోంది.
ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన సురభి హీరోయిన్‌గా నటిస్తుండగా.. స్వర్గలోకపు అప్సరసలైన రంభ, ఊర్వశి, మేనక పాత్రలలో రాశి సింగ్, విష్ణుప్రియ , ప్రిష సింగ్ నటిస్తున్నారు. చంద్రామోహన్ చింతడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక అపూర్వ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తోంది. మొత్తానికి ఈ టీజర్‌తో అల్లరి నరేష్ మరోసారి తన పాత కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారనే అంచనాలు భారీగా పెరిగాయి.
- AllariNareshRambhaUrvashiMenakaROMTeaserRambhaUrvashiMenakaTeaserComedyGoesCosmicAllariNareshComedyTeluguCinemaTollywoodTeluguMoviesFantasyComedyComedyEntertainerChandraMohanChintadaAnnapurnaStudiosHasyaMoviesMovieTeaserTollywoodNewsEntertainmentNewsLatestEntertainmentNewsLatestTeluguNewsTeluguNewsBreakingNewsLatestNews

