Rana and Miheeka: వివాహ బంధంలో ఆరేళ్లు పూర్తి.. పెళ్లినాటి పిక్స్‌తో శుభాకాంక్షలు తెలిపిన రానా సతిమణి మిహీకా..
రానా సతిమణి మిహీకా..

Rana and Miheeka: టాలీవుడ్ భల్లాళదేవ, వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి-మిహీకా బజాజ్ దంపతులు తమ వివాహ బంధంలో ఆరో వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ ఆరో పెళ్లిరోజు సందర్భంగా మిహీకా తన సోషల్ మీడియా ఖాతాలో పెళ్లి వేడుకకు సంబంధించిన రెండు అపురూపమైన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
నెటిజన్లను ఆకట్టుకుంటున్న అన్ సీన్ పిక్స్
మిహీకా షేర్ చేసిన ఒక ఫొటోలో రానా, మిహీకా ఒకరినొకరు అనురాగంతో చూసుకుంటుండగా.. మరొక ఫొటోలో పెళ్లి పీటలపై మిహీకా సిగ్గుపడుతూ కనిపించారు. ఈ ఫొటోలకు 08.08.2020 అంటూ వారి వివాహ తేదీని క్యాప్షన్‌గా జోడించారు. ఈ పోస్ట్‌పై మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ ‘ఎప్పటికీ నా ఫేవరెట్ కపుల్’ అంటూ హార్ట్ ఎమోజీలతో విష్ చేయగా, అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు వెల్ విషెస్ చెబుతున్నారు.
కరోనా కాలంలో కొద్దిమంది సమక్షంలో పెళ్లి
రానా సోదరి మాళవికతో ఉన్న సహచర బంధమే మిహీకాతో రానాకు పరిచయాన్ని ఏర్పరిచింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో 2020 ఆగస్టు 8న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో కరోనా నిబంధనల నడుమ అత్యంత వేడుకగా వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు రామ్ చరణ్, సమంత, నాగచైతన్య వంటి కొద్దిమంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
రానా లైనప్ సినిమాలు
మరోవైపు వరుస సినిమాలతో రానా ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో రాక్షస రాజా అనే ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇది చివరి త్రైమాసికంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు తమిళ పీరియాడికల్ మూవీ పరాశక్తిలో కీలక పాత్ర పోషిస్తున్న రానా, నీలిరా అనే యుద్ధ నేపథ్య చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు.

