రానా ప్రశంసలు

Rana Daggubati Praises Actress Bhagyashree: దుల్కర్ సల్మాన్, రానా, భాగ్యశ్రీ బోర్సే నటించి కాంతా మూవీ యావరేజ్ టాక్‌తో నడుస్తోంది. ఈ క్రమంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేపై రానా ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల భాగ్యశ్రీ సోషల్ మీడియా పోస్ట్‌లో రానాను నిజమైన స్నేహితుడు, మెంటార్ అని అభివర్ణించగా, దానికి స్పందనగా రానా ఆమె అంకితభావాన్ని కొనియాడారు.

తమిళం నేర్చుకోవడానికి 6నెలలు!

భాగ్యశ్రీ సిన్సియారిటీని, నిజాయతీని రానా ప్రత్యేకంగా ప్రస్తావించారు. "భాగ్యశ్రీ అలా చెప్పడం ఆమె మంచితనం. ఆమె చాలా సిన్సియర్. ఈ సినిమా కోసం ముంబై నుంచి వచ్చిన ఆమె తమిళం నేర్చుకోవాలని మేము చెప్పగానే, ఏకంగా 6నెలల పాటు ఇక్కడే ఉండి భాష నేర్చుకుంది. ఈ రోజుల్లో ఇంతటి అంకితభావం చూడటం చాలా అరుదు. ఆమె నిజాయతీ అసాధారణం" అని రానా భాగ్యశ్రీ కృషిని కొనియాడారు.

కుమారి పాత్రకు సరైన నటి దొరికింది

ప్రారంభంలో, దుల్కర్ సల్మాన్, సముద్రఖని వంటి గొప్ప నటులతో సరిపోయే కొత్త నటి కోసం టీమ్ కంగారుపడిందని రానా వివరించారు. అయితే టెస్ట్ షూట్ ప్రారంభమైన కొద్ది రోజులకే తమ కుమారి పాత్రకు సరైన నటి దొరికిందని తమకు అర్థమైందన్నారు.

మెంటార్‌గా రానాకు భాగ్యశ్రీ కృతజ్ఞతలు

కాంత యూనిట్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ భాగ్యశ్రీ పెట్టిన పోస్ట్‌లో.. "మొదటి రోజు నుంచి నాకు మద్దతుగా నిలిచిన రానాకు ధన్యవాదాలు. మీరు నా ప్రయాణంలో ఒక మెంటార్. మీ మార్గదర్శకత్వం లేకపోతే నేను ఇది చేయగలిగేదాన్ని కాదు" అని తెలిపింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story