Ranveer Singh Dominates OTT: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar The Revenge).. ఇప్పుడు ఓటీటీని కూడా షేక్ చేస్తోంది! థియేటర్లలో రికార్డులు తిరగరాసిన ఈ మూవీ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా అదే స్థాయి ఊచకోత కోస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం.. కేవలం కొన్ని రోజుల్లోనే ఊహించని రేంజ్‌లో రికార్డు వ్యూస్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఓన్ చేసుకున్నారు. జూన్ 5 నుంచి జియో హాట్‌స్టార్‌లో పూర్తిస్థాయిలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సినిమాను.. మొదటి వారాంతంలోనే, అంటే కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 5 కోట్లకు పైగా మంది వీక్షించినట్లు జియో హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటూ సౌత్ టు నార్త్ ట్రెండ్ అవుతోంది.

నిజానికి ఈ 'ధురంధర్' ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనం. మొదటి భాగం 'ధురంధర్' 2025 డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చి.. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1307 కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. ఇక దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'ధురంధర్ 2' ఈ ఏడాది మార్చి 19న విడుదలై.. మొదటి భాగాన్ని మించి ఏకంగా రూ.1790 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

రణ్వీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్ వంటి భారీ తారాగణం ఈ రెండు చిత్రాల్లో నటించి తమ యాక్టింగ్‌తో మెప్పించారు. ఆదిత్య ధర్ టేకింగ్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులు, ఊహించని ట్విస్టులు ఓటీటీ ఆడియన్స్‌ను కూడా టీవీ స్క్రీన్లకు కట్టేసి పడేస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story