Rare Honour for Rajinikanth and Balakrishna: రజినీ,బాలయ్యలకు అరుదైన గౌరవం
అరుదైన గౌరవం

Rare Honour for Rajinikanth and Balakrishna: బాలకృష్ణ , రజినీకాంత్ లకు అరుదైన గౌరవం దక్కనుంది. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గుర్తుగా, ఈ ఇద్దరు దిగ్గజ నటులు తమ సినీ ప్రయాణంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో వీరిని సన్మానించనున్నారు.
కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్ ఈ విషయం ప్రకటించారు. "సినీ ప్రయాణంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీకాంత్, బాలకృష్ణలను సన్మానించనున్నాం. ఇది భారతీయ సినిమా రంగంలోనే ఒక మైలురాయి. వారి కృషికి గుర్తింపుగా ఇఫి ముగింపు వేడుకల్లో వారిని సన్మానించనున్నాం."రజినీకాంత్ నటించిన 'లాల్ సలామ్' చిత్రాన్ని కూడా ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
గోవాలోని పనాజీలో 56వ IFFI నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనుంది.ఈ సన్మాన కార్యక్రమం ముఖ్యంగా ముగింపు వేడుక (Closing Ceremony) లో జరగనుంది. 127 దేశాల నుండి 3,400కు పైగా చిత్రాలు సమర్పించబడ్డాయి. 84 దేశాల నుండి 270కి పైగా చిత్రాలు ప్రదర్శించబడతాయి. సాంప్రదాయ వేడుకకు బదులుగా, ఈసారి కలర్‌ఫుల్ పరేడ్తో ఫెస్టివల్‌ను ప్రారంభించనున్నారు.

