పర్ఫెక్ట్ షాట్ కోసం ఎన్నిసార్లు ముఖం కడుక్కోవాల్సి వచ్చిందో తెలుసా?

Rashi Khanna’s Struggle on Set: ప్రముఖ నటి రాశీ ఖన్నా తన కొత్త మూవీ 120 బహదూర్ షూటింగ్‌లో పడిన శ్రమను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా ఫర్హాన్ అక్తర్‌తో కలిసి ఆమె నటించిన నైనా రా లోభి రొమాంటిక్ పాట చిత్రీకరణ సమయంలో పర్ఫెక్షన్ కోసం ఆమె ఎంత కష్టపడాల్సి వచ్చిందో వివరించారు. రాశీ తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో ఈ లుక్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. ఈ పాటలో ఉపయోగించిన రంగులు, హస్తకళ మరియు సాంస్కృతిక వివరాలు తనకు చాలా ప్రత్యేకమని తెలిపారు. అయితే సరైన టేక్ కోసం ప్రతిసారి ముఖం కడుక్కొని, మొత్తం లుక్‌ను మళ్లీ రీక్రియేట్ చేయాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.

"లెక్కలేనన్ని రీసెట్లు, మళ్లీ మళ్లీ లుక్‌ను తయారు చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, నా హెయిర్, మేకప్ టీం ప్రతి టేక్‌లోనూ ఎంతో ఓపికగా, పర్ఫెక్ట్‌గా పనిచేశారు. ఒక మంచి అవుట్‌పుట్ వెనుక ఇంతమంది కృషి ఉంటుంది" అని రాశీ ఖన్నా తన టీమ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

జావేద్ అలీ, అసీస్ కౌర్ ఆలపించిన నైనా రా లోభి పాటలో ఫర్హాన్ అక్తర్, రాశీ ఖన్నా మధ్య చక్కటి కెమిస్ట్రీ ఉంది. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన 120 బహదూర్ చిత్రం, రెజాంగ్ లా సరిహద్దులో 120 మంది సైనికులు చూపిన వీరోచిత పోరాటం ఆధారంగా తెరకెక్కింది. రాజ్‌నీష్ రాజీ ఘాయ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 21న విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story