Rashmika: పూర్తిస్థాయి యాక్షన్ అవతార్‌లో రష్మిక.. మైసా రిలీజ్ ఎపుడంటే.?
మైసా రిలీజ్ ఎపుడంటే.?
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' సినిమా విడుదల తేదీని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నవంబరు 27న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. "భయం లేనిది, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం ఉన్న మైసా ప్రపంచంలో రష్మికను మునుపెన్నడూ చూడని రీతిలో చూస్తారు అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేస్తోంది. ఈ చిత్రంలో రష్మిక పూర్తిస్థాయి యాక్షన్ రోల్‌లో అలరించనున్నారు.
ఇదిలా ఉంటే, రష్మిక మరోవైపు పాన్ ఇండియా చిత్రం 'రణబాలి'తోనూ అలరించేందుకు సిద్ధమవుతున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మికనే కథానాయిక. పెళ్లి తర్వాత ఈ క్రేజీ జంట కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
ఒకవైపు అక్టోబరు 16న దసరా కానుకగా 'రణబాలి'తో పలకరించనున్న రష్మిక... నవంబర్ 27న 'మైసా'తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి వస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది చివర్లో రష్మిక ఫ్యాన్స్‌కు థియేటర్లలో పండగే అని చెప్పాలి

