‘Mysa’ Teaser: టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' (Mysaa) చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక గిరిజన అమ్మాయిగా సరికొత్త పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతోంది. గోండ్ తెగ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ సర్వైవల్ డ్రామాపై ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టీజర్‌ను జూలై 15న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

​ఈ చిత్రంలో రష్మిక గతంలో ఎన్నడూ చూడని విధంగా ఊరమాస్, రగ్గడ్ లుక్‌లో కనిపించడమే కాకుండా, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా ఇరగదీసిందని టాక్. టీజర్ అప్‌డేట్‌తో పాటే సినిమా రిలీజ్ డేట్‌పై కూడా ఒక లీక్ వచ్చేసింది. ఈ సినిమాను అక్టోబర్ 16న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ లెక్కన చూసుకుంటే ఈ ఏడాది చివర్లో రష్మిక బాక్సాఫీస్ వద్ద గట్టిగానే సందడి చేయనుంది. సెప్టెంబర్ నెలలో ‘రణబాలి’ సినిమాతో, ఆ వెంటనే అక్టోబర్‌లో ‘మైసా’ చిత్రంతో రష్మిక బ్యాక్-టు-బ్యాక్ థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story