Rashmika Mandanna: షూటింగ్‌లో గాయపడిన రష్మిక మందన్న..ఆరు వారాల పాటు విశ్రాంతి
ఆరు వారాల పాటు విశ్రాంతి

Rashmika Mandanna: టాలీవుడ్‌లో వరుస గాయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ సినీ నటి రష్మిక మందన్న షూటింగ్‌లో గాయపడ్డారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఆమె నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' చిత్రంలో ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రష్మిక తుంటి భాగంలో బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించి, ఆమెకు ఆరు వారాలపాటు ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ఈ చిత్రంలో ఆమె గోండు తెగ మహిళగా కనిపించనుండగా, కీలక యాక్షన్ సీక్వెన్సులు ఇప్పటికే పూర్తయ్యాయి. మరోవైపు విజయ్ దేవరకొండతో ఆమె నటిస్తున్న 'రణబాలి' చిత్రం సెప్టెంబరు 11న విడుదల కానుంది.
ఇక ఈ ఏడాది టాలీవుడ్ స్టార్ హీరోలను గాయాలు తీవ్రంగా వెంటాడుతున్నాయి. ఇటీవల బాలకృష్ణ తన సినిమా షూటింగ్‌లో గాయపడి ఆపరేషన్ చేయించుకోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ భుజం గాయం కారణంగా 6 నుంచి 8 వారాల విశ్రాంతిలో ఉన్నారు.
అలాగే 'పెద్ది' షూటింగ్‌లో రామ్ చరణ్ మణికట్టుకు గాయమవగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. చిరంజీవి చేతికి బెల్ట్ కనిపించడం, పవన్ కల్యాణ్ భుజం గాయానికి ముంబయిలో సర్జరీ చేయించుకోవడం వంటి పరిణామాలు టాలీవుడ్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి.

