Rashmika Mandanna: అంతర్జాతీయ వేదికపై రష్మిక మందన్న మరో అరుదైన ఘనతను దక్కించుకోబోతున్నారు. టోక్యోలో జరగనున్న ప్రతిష్టాత్మక 'గ్లోబల్ యానిమే అవార్డ్స్ 2026'లో గ్లోబల్ పాప్ స్టార్ ‘ది వీకెండ్’ తో కలిసి ఆమె వేదికను పంచుకోనున్నారు. రెండేళ్ల క్రితం ఇదే వేదికపై ప్రెజెంటర్‌గా మెరిసిన రష్మిక, ఈసారి ఏకంగా హోస్ట్‌గా వ్యవహరించడం విశేషం. ఈ వేడుక మే 23, 2026న ఘనంగా జరగనుంది.

యానిమే రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గౌరవించే ఈ అంతర్జాతీయ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరవుతారు. ఈ ఏడాది ఎంపికైన ఎలైట్ లైనప్ ప్రజెంటర్లలో రష్మిక ఒకరు కాగా, గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్ ది వీకెండ్ (అబెల్ టెస్ఫాయే) కూడా హాజరవుతుండటం చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ స్థాయి పాప్ సింగర్‌తో కలిసి రష్మిక ఈ వేదికపై కనిపించనుండటం జపాన్ మార్కెట్‌లో ఆమె పాపులారిటీని మరింత పెంచుతుందని భావిస్తున్నారు.

రష్మికకు యానిమే పట్ల ఉన్న మక్కువ అందరికీ తెలిసిందే. అందుకే ఆమె నిరంతరం జపాన్ ప్రేక్షకులతో టచ్‌లో ఉంటారు. ఇటీవలే ఆమె తన చిత్రం ‘పుష్ప 2’ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లినప్పుడు అక్కడ అభిమానుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ అంతర్జాతీయ వేదిక ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది.

ప్రస్తుతం రష్మిక వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ సరసన ‘రణబలి’ చిత్రంలో నటిస్తున్న ఆమె, తన తదుపరి మహిళా ప్రధాన యాక్షన్ చిత్రం ‘మైసా’ (Mysaa) పనుల్లో కూడా నిమగ్నమై ఉన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story