నెగటివ్ రోల్‌లో శ్రీవల్లి

అల్లు అర్జున్-అట్లీ సినిమాలో రష్మిక మందన్న.. నెగటివ్ రోల్‌లో 'శ్రీవల్లి' సాహసం?

Rashmika Mandanna to Play a Negative Role: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈసారి ఆమె అల్లు అర్జున్‌కు జోడీగా కాకుండా, నెగటివ్ షేడ్స్ (ప్రతినాయిక) ఉన్న పాత్రలో కనిపించబోతుండటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో రష్మిక కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. హార్డ్ కోర్ యాక్షన్ సీక్వెన్సులు, ఎమోషనల్ డ్రామాతో కూడిన ఈ ఇండోర్ షూటింగ్ ఫిబ్రవరి మధ్య వరకు కొనసాగనుంది. రష్మిక తన కెరీర్‌లో ఇప్పటివరకు పోషించిన సాఫ్ట్ , బబ్లీ పాత్రలకు భిన్నంగా, ఈ సినిమాలో అత్యంత ధైర్యవంతమైన, పవర్‌ఫుల్ విలన్ రోల్‌లో కనిపిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై దాదాపు రూ. 800 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే దీపికా పదుకొనే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు రష్మిక చేరికతో ఈ సినిమా కాస్టింగ్ మరింత క్రేజీగా మారింది.ఇది ఒక సైన్స్ ఫిక్షన్ (Sci-Fi) డ్రామా అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒకటి కంటే ఎక్కువ పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని టాక్. షూటింగ్‌ను 2026 మధ్య నాటికి పూర్తి చేసి, 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరోవైపు, రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వివాహ వార్తలు కూడా ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి చివర్లో వీరి వివాహం ఉండొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో, రష్మిక తన షూటింగ్ షెడ్యూల్స్‌ను త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story