Rashmika Reveals: ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో.. గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక
లీక్ చేసిన రష్మిక

Rashmika Reveals: సాధారణంగా గ్లోయింగ్ స్కిన్ లేదా మెరిసే చర్మం వెనుక ఉన్న రహస్యం ఏంటని ఎవరినైనా అడిగితే.. రకరకాల కాస్మోటిక్స్, ఫేస్ క్రీములు, లేదా ఫేస్ ప్యాక్‌ల పేర్లు చెబుతుంటారు. కానీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న మాత్రం తన అందం వెనుక ఉన్న సీక్రెట్ 'మనసులోని ఆనందమే' అని అంటోంది.
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించిన రష్మిక.. తన గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్‌ను బయటపెట్టింది. ఈ లైవ్ సెషన్‌లో ఒక అభిమాని రష్మికను.. మీ బ్యూటీ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?" అని అడిగాడు. దానికి రష్మిక చాలా క్యూట్‌గా, అంతే అర్థవంతంగా సమాధానమిచ్చింది.రష్మిక ఏమందంటే.. "ఎప్పుడూ సంతోషంగా ఉండండి. మిమ్మల్ని ఎల్లప్పుడూ నవ్వించే వాళ్లతోనే ఉండటానికి ప్రయత్నించండి. మనలోని అమాయకత్వాన్ని కాపాడుకుంటేనే నిజమైన ఆనందం దొరుకుతుంది" అని జవాబిచ్చింది. మనసు సంతోషంగా ఉంటే ముఖం దానంతట అదే మెరుస్తుందని ఈ క్రేజీ బ్యూటీ వివరించింది.
మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే.. మన చుట్టూ ఉండే పాజిటివిటీనే మనకు అసలైన అందాన్ని ఇస్తుందని రష్మిక చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రష్మిక ఇచ్చిన ఈ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లైఫ్ టిప్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

