Rashmika-Vijay Deverakonda Birthday Pics: టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ రష్మిక మందన్న - విజయ్ దేవరకొండల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయ్ పుట్టినరోజు(మే9) సందర్భంగా రష్మిక షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తన భర్తకు "మై విజ్జు" అంటూ ఎంతో ప్రేమగా విషెస్ చెప్పింది నేషనల్ క్రష్.

అయితే ఈ పోస్ట్‌లో ఒక ప్రత్యేకత ఉంది. రోజంతా జరిగిన విషయాలను రష్మిక 'రివర్స్ ఆర్డర్'లో వివరిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. జిమ్ సెల్ఫీలు, కారులో ఏకాంతంగా గడిపిన క్షణాలు, ఇరు కుటుంబ సభ్యులతో దిగిన అరుదైన ఫొటోలను షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది.

ఈ రోజు మై మ్యాన్ బర్త్ డే.. నా రోజంతా ఇలా గడిచిపోయింది.. అయితే రివర్స్‌లో చెబుతున్నా" అంటూ మొదలుపెట్టిన రష్మిక.. మొదట ఫ్రెండ్ ఇంటికి వెళ్లడం, అంతకుముందు జిమ్‌లో వర్కౌట్ చేయడం, అంతకంటే ముందు విజయ్‌ని కలవడానికి వచ్చిన అభిమానుల కోలాహలం గురించి పూసగుచ్చినట్టు వివరించింది.

అదృష్టవశాత్తూ తన షూటింగ్ క్యాన్సిల్ అవ్వడంతో.. రోజంతా విజయ్‌తో గడపడం చాలా పర్ఫెక్ట్‌గా అనిపించిందని ఆమె రాసుకొచ్చింది. చివరగా “హ్యాపీయెస్ట్ బర్త్‌డే టు యూ మై విజ్జు!” అంటూ ముగించింది. ప్రస్తుతం ఈ క్యూట్ ఫోటోలు నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story