వైరల్‌గా మారిన ఆనంద్ దేవరకొండ ఫొటో

Rashmika’s Buzz on the Streets of Rome: టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలోనే ఒక్కటి కాబోతున్నారని సమాచారం. కొత్త ఏడాది వేడుకల కోసం రష్మిక ప్రస్తుతం ఇటలీలోని రోమ్ నగరంలో విహరిస్తున్నారు. అక్కడి అందాలను ఎంజాయ్ చేస్తూ ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. "Rome so far" అనే క్యాప్షన్‌తో రష్మిక తన వెకేషన్ ఫొటోలను పంచుకున్నారు. ఇందులో ఆమె తన ఫ్రెండ్స్‌తో కలిసి డ్యాన్సులు చేస్తూ, చారిత్రక కట్టడాల ముందు సందడి చేస్తూ కనిపించారు.

సీన్‌లోకి ఆనంద్ దేవరకొండ

రష్మిక షేర్ చేసిన ఆల్బమ్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. అందులో విజయ్ దేవరకొండ తమ్ముడు, హీరో ఆనంద్ దేవరకొండ కూడా ఉండటం. ఒక ఫొటోలో రష్మిక, ఆనంద్ సరదాగా నవ్వుకుంటూ కనిపించడంతో అభిమానుల అనుమానాలు నిజమవుతున్నాయి.

కెమెరా వెనుక విజయ్ ఉన్నారా?:

ఆనంద్ దేవరకొండ అక్కడ ఉన్నారంటే, కచ్చితంగా విజయ్ కూడా అక్కడే ఉండి ఉంటారని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. "ఈ ఫొటోలు తీసింది విజయ్ దేవరకొండేనా?" అంటూ కామెంట్లతో రష్మికను ఆటపట్టిస్తున్నారు. గతంలో కూడా వీరిద్దరూ ఒకే రకమైన లొకేషన్ల నుండి ఫొటోలు షేర్ చేయడం, విజయ్ ఫ్యామిలీ ఫంక్షన్లలో రష్మిక మెరవడం వంటివి చూస్తుంటే, వీరిద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందని, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గీత గోవిందం జోడీ రిలేషన్‌షిప్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఈ తాజా రోమ్ టూర్ ఫొటోలు మాత్రం వారిద్దరూ కలిసి ఉన్నారనే సంకేతాన్ని బలంగా పంపుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story